ETV Bharat / bharat

రహదారులు రక్తసిక్తం- ఏడుగురు మృతి - bagalkot accident news today

కర్ణాటకలోని రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. బాగల్​కోట్​లోని హునగుండా తాలూకాలో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించగా.. కొప్పాల్​ జిల్లాలోని గంగావతి తాలూకాలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

7 people died in a two separate road mishap
వేరువేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
author img

By

Published : Mar 29, 2021, 11:23 AM IST

కర్ణాటకలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బాగల్​కోట్​ జిల్లా హునగుండా తాలూకా బేవనమత్తి గ్రామంలో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారంతా ఇలాకల్​కు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వారిని చంద్రు బుట్టా, నవీన్ సాకా, కరి బసయ్యలుగా గుర్తించారు. మరో వ్యాక్తి ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ విజయ్ పరిస్థితి విషమంగా ఉండగా.. ఆయన్ని బాగల్​కోట్​ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మరో ప్రమాదంలో ముగ్గురు..

కొప్పాల్​ జిల్లా గంగావతి తాలూకా లోని ముక్కుంపి అడ్డరోడ్డు దగ్గర లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని ఫికీరప్ప నాగప్ప హోల్యచే, భీమన్న చిన్నప్ప హయాతీ, రామన్న శంకరప్ప డాలీలుగా గుర్తించారు. లారీ డ్రైవర్​ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: భారీ అగ్ని ప్రమాదం- నలుగురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.