ETV Bharat / bharat

సిలిండర్​ పేలి ఒకే కుటుంబంలో 9 మంది మృతి - సిలిండర్​ పేలి

సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కూలీలు మృతిచెందారు. మరొకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మృతులంతా మధ్యప్రదేశ్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

cylinder explosion
సిలిండర్​ పేలి
author img

By

Published : Jul 24, 2021, 7:19 AM IST

Updated : Jul 24, 2021, 10:33 AM IST

గుజరాత్​, అహ్మదాబాద్​లోని బరేజా ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కూలీలు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా కూలీపనుల కోసం.. మధ్యప్రదేశ్, గుణ జిల్లా నుంచి గుజరాత్​కు​ వచ్చారు. స్థానికంగా ఉన్న బాదం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

cylinder explosion
సిలిండర్ పేలి ధ్వంసమైన ఇల్లు
cylinder explosion
సీఎం దిగ్భ్రాంతి

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటన మరణించిన వారికి స్థానిక ఎమ్మెల్యే కూడా నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

cylinder explosion
సిలిండర్ పేలి ఊడిపోయిన పైకప్పు
cylinder explosion
జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్​

ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ నేత జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్​ ద్వారా విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ఉగ్రవాదుల ఏరివేత- 98మంది హతం!

Last Updated : Jul 24, 2021, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.