బంగాల్లో వరదల ధాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు దామోదర్ లోయ ప్రాంతంలోని ఆనకట్టల నుంచి పోటెత్తిన వరదల కారణంగా ఆరు జిల్లాలకు చెందిన 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.
తూర్పు వర్ధమాన్, పశ్చిమ్ వర్ధమాన్, పశ్చిమ మెదినీపుర్, హూగ్లీ, హావ్డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాలను వరదలు ముంచెత్తాయని అధికారులు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధితులకు వసతులు కల్పిస్తున్నామని.. టార్పాలిన్, బియ్యం, దుస్తులు, తాగునీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి : 'సాగర్' సమీపంలో కూలిన ఆర్మీ హెలికాప్టర్