ETV Bharat / bharat

14 రోజుల్లో 6 ఏనుగులు మృతి.. అదే కారణమా?

ఒడిశాలోని కలహండి జిల్లా కర్లాపాత్​ అభయారణ్యంలో ఏనుగులు అనుమానాస్పద రీతిలో మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. 14 రోజుల్లోనే 6 గజరాజులు ప్రాణాలు కోల్పోయాయి. ఇది వేటగాళ్ల పనేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

elephants, odisha, kalahandi
గజరాజుల అనుమానాస్పద మృతి.. 14 రోజుల్లో 6 ఏనుగులు బలి!
author img

By

Published : Feb 15, 2021, 1:07 PM IST

ఒడిశాలోని కలహండి జిల్లా కర్లాపాత్​ అభయారణ్యంలో ఏనుగుల అనుమానాస్పద మృతి జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 14 రోజుల్లో 6 గజరాజులు మృతిచెందాయి. ఇందులో 5 ఆడ ఏనుగులు, ఓ గున్న ఏనుగు ఉన్నాయి. మరణానికి కారణం పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్​ సెప్టీస్కేమియా అనే వ్యాధి అని అధికారులు భావిస్తున్నారు. ఓ ఏనుగుకు జరిపిన పోస్ట్​మార్టం రిపోర్ట్​ మృతికి కారణం ఈ వ్యాధే అని సూచిస్తోందని పేర్కొన్నారు. పశువుల్లో వ్యాపించే ఈ వ్యాధి ఏనుగులకు సోకడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించలేదని, ఇటీవల వ్యాక్సినేషన్​ కూడా జరిపామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పశువులకు మరోసారి వ్యాక్సిన్​ వేయిస్తామని తెలిపారు.

ప్రజల అనుమానాలు?

వరుసగా ఏనుగులు మృతి చెందడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణుల కోసం నిర్మించిన ఉప్పునీటి కొలనుల్లో వేటగాళ్లు విషం కలిపి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదా హేమోర్హేజ్​ సెప్టీస్కేమియా జబ్బు సోకిన పశువుల కారణంగా ఈ కొలను నీరు కలుషితమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మొదట అభయారణ్యంలో అనేక చోట్ల సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారని, కానీ అకారణంగా వాటిని తొలగించారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేస్తున్నారు స్థానికులు.

ఇదీ చదవండి : 108 ఆలయాలతో 'గుప్తకాశీ'గా మలూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.