ETV Bharat / bharat

ఉప్పు పేరుతో పోర్టుకు సరకు.. చూస్తే కొకైన్​.. విలువ రూ. 500 కోట్లకుపైనే!

Mundra port: గుజరాత్​లోని ముంద్రా పోర్టులో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉప్పు పేరుతో వీటిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో దాదాపు రూ.500 కోట్లు విలువ చేసే 57 కిలోల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు.

mundra port latest news
adani port drugs latest news
author img

By

Published : May 27, 2022, 5:22 AM IST

Updated : May 27, 2022, 7:22 AM IST

Mundra port: గుజరాత్‌లో భారీ మొత్తంలో కొకైన్‌ పట్టుబడింది. 'ఆపరేషన్‌ నమ్కీన్‌'లో భాగంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.500 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్‌ నుంచి ఉప్పు పేరుతో సరకు వచ్చిందనే సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో సోదాలు నిర్వహించారు. అనుమానంతో జరిపిన సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు 57 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. కొకైన్‌ దిగుమతి విషయంలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గతంలోనూ ఇదే పోర్టులో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డీఆర్‌ఐ అధికారులు ముంద్రా పోర్టులో రూ. 9వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో సంబంధాలు సైతం ఉండటం గమనార్హం. నిఘా వర్గాల సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్‌ బయటపడింది. ఆ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకు చెందినవిగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్​లో రూ.100కోట్ల డ్రగ్స్: రాష్ట్రంలోని ఇటార్సీలోను నార్కోటిక్ అధికారులు ఓ డ్రగ్​ డీలర్​ నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ హోటల్​లో రూంలో 21 కేజీల ఎండీ డ్రగ్స్ కలిగి ఉన్న నైజీరియాకు చెందిన యువకుడు, మహిళను అరెస్టు చేశారు. వీటి విలువ రూ.100కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. మిజోరానికి చెందిన మహిళలకు కూడా దీనితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: పేటీఎం లేదు.. అయినా ఆ పేరుతో రూ.20వేలు కట్​! కొత్త మోసం గురూ!!

Last Updated : May 27, 2022, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.