బంగాల్‌లో ఈ నెల 27న జరగనున్న శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం 415 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపనున్నారు. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉండనున్నారు.
ఇప్పటికే 200 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు.. బంగాల్‌కు చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మిగతా 215 కంపెనీల బలగాలు త్వరలోనే అక్కడకు చేరుకుంటాయని వెల్లడించాయి.
బంగాల్‌లో తొలి విడతలో 5 జిల్లాల పరిధిలోని 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు అజయ్ నాయక్, పోలీసు పరిశీలకుడు వివేక్ దూబే.. ఎన్నికల్లో భద్రతా చర్యలపై కోల్‌కతాలో శనివారం సమీక్ష నిర్వహించారు.
బంగాల్‌లో 8 దశల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.