మహారాష్ట్రలోని రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వేగంగా ఉన్న వాహనాలు ఢీకొన్న కారణంగా ఆటోలోని సీఎన్జీ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాపించిన మంటలతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.
మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారు, ఆటో పూర్తిగా కాలిపోయాయి.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి