రాజస్థాన్‌లో పొలం పనులు చేస్తున్నవారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు. ఉదయపూర్‌లోని బిందర్ పోలీస్ స్టేషన్ పరిధి బోర్తలై మోర్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు వివరించారు.
మరణించిన వారు తమ పొలంలోని బావి తవ్వకంలో నిమగ్నమై ఉన్నారని.. నియంత్రణ కోల్పోయిన కారు వారిపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రజలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు జిల్లా ఎస్పీ రాజీవ్ పచ్చర్ సైతం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ప్రాథమిక దర్యాప్తులో వాహనం నడిపిన వ్యక్తి మద్యం సేవించినట్లు తెలిసిందని వెల్లడించారు.
ఇవీ చదవండి: లైవ్ వీడియో: గ్రామస్థులను చితకబాదిన పోలీసులు