మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన వేళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అందుకు అవకాశాలు తక్కువేనని ఆయా రాష్ట్రాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల వర్చువల్ భేటీలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
'సవతి ప్రేమ చూపిస్తోంది'
టీకా తయారీదారుల నుంచి వ్యాక్సిన్లను కేంద్రం హైజాక్ చేస్తోందని మంత్రులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చే అవకాశాలు తక్కువేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. పౌరులందరికీ టీకాలు ఇచ్చేలా కేంద్రం తమకు ఉచితంగా టీకాలు అందజేయాలని కోరుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే సామర్థ్యమున్నా.. టీకాలు అందుబాటులో లేవని చెబుతున్నాయి.
ఇదీ చూడండి: వీరి మనోధైర్యం ముందు తోకముడిచిన కొవిడ్
ఇదీ చూడండి: 'వ్యవస్థ విఫలం.. ఇప్పుడు కావాల్సింది 'జన్‌కీ బాత్''