బిహార్‌లోని విద్యార్థినులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో.. విద్యార్థినులకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక విభాగం అధికారులతో సమీక్ష జరిపిన నితీశ్.. వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
ఇది ఓ ప్రత్యేకమైన ప్రయత్నమన్న బిహార్ ముఖ్యమంత్రి రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఉన్నత విద్య వైపు అమ్మాయిలను ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు. ఇదే సమయంలో మెడికల్, ఇంజినీరింగ్ విద్య కోసం బిహార్ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినఅవసరం ఉండకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు ఎప్పుడు?