ETV Bharat / bharat

Black fungus: ఆ ఆస్పత్రిలో 20రోజుల్లోనే 32మంది బలి

మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని ఓ ఆస్పత్రిలో మ్యూకర్​మైకోసిస్(బ్లాక్​ఫంగస్​)​ వ్యాధి బారిన పడి 20 రోజుల వ్యవధిలోనే.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 323 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Jun 2, 2021, 5:10 PM IST

black fungus
మ్యూకర్​మైకోసిస్, బ్లాక్​ ఫంగస్​

మధ్యప్రదేశ్​లో మ్యూకర్​మైకోసిస్(బ్లాక్​ ఫంగస్​)​ పంజా విసురుతోంది. ఇందోర్​ నగరంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మహారాజా యశ్వంత్​రావ్​ ఆస్పత్రి(ఎంవైహెచ్​)లో ఈ వ్యాధి సోకి 20 రోజుల వ్యవధిలోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

"మ్యూకర్​మైకోసిస్​ వ్యాధి బారిన పడ్డ ఓ వ్యక్తి ఎంవైహెచ్​లో మే 13న తొలిసారి చేరారు. అప్పటినుంచి మొత్తం 439 మంది ఇప్పటివరకు ఇక్కడ చేరారు. వారిలో 84 మంది డిశ్చార్జి అయ్యారు. 32 మంది చనిపోయారు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు మేం 200కు పైగా సర్జరీలను నిర్వహించాం. ప్రస్తుతం 323 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు."

-ఫణీంద్ర ఠాకూర్​, ఎంవైహెచ్​ సూపరింటెండెంట్​

ఒక్క ఇందోర్​ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా చికిత్స కోసం ఎంవైహెచ్​కు విచ్చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 323 మందిలో.. 14 మందికి కొవిడ్​ ఉండగానే మ్యూకర్​మైకోసిస్​ సోకినట్లు తేలిందని ఫణీంద్ర ఠాకూర్ చెప్పారు. 301 మందికి కొవిడ్​ అనంతరం ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు. మరో 8 మందికి ఈ శిలీంధ్ర వ్యాధి సోకినప్పటికీ.. వారు గతంలో కొవిడ్​ బాధితులు కారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంవైహెచ్​లో మ్యూకర్​మైకోసిస్​ మరణాల రేటు 7.29 శాతంగా ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: Fungus: ఈ సారి 'స్కిన్​ బ్లాక్​ ఫంగస్'​- దేశంలో తొలి కేసు

ఇదీ చూడండి: దేశంలో కొత్త ఫంగస్- ఆగ్రాలో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.