భారీ హిమపాతానికి ముగ్గురు పర్వతారోహకులు చనిపోయారు. మొత్తం 13 మంది ఓ బృందంగా వెళ్లగా.. మిగతా పది మందిని కాపాడినట్లు ఇండో-టిబెటన్ సరిహద్దు దళం తెలిపింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లాలో జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు.
"ముగ్గురు పర్వతారోహకులు చనిపోయారు. వీరి మృతదేహాలు 15వేల అడుగుల ఎత్తులో చిక్కుకుపోయాయి. మరో 10 మందిని రక్షించగలిగాం. చనిపోయిన వారిని వెతికేందుకు ఐటీబీపీ బృందం ఈ రోజు ఘటనాస్థలికి చేరుకుంటుంది."
-అధికారులు
తొలుత పర్వతారోహకులు రోహ్రూ నుంచి బురువా గ్రామానికి అక్టోబర్ 17న ట్రెక్కింగ్ ప్రారంభించారు. అయిత బురువా కంద ప్రాంతంలో కురిసిన భారీ హిమపాతం కారణంగా వారు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తలిపారు. చనిపోయిన వారిని రాజేంద్ర పాఠక్, అశోక్ భలేరావ్, దీపక్ రావులుగా గుర్తించారు.
ఈ బృందంలో 12 మంది మహారాష్ట్రకు చెందిన వారిగా పేర్కొన్న పోలీసులు.. మిగిలిన ఒక్కరిని కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా వివరించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: విషాదం- ట్రెక్కింగ్‌కు వెళ్లి 12 మంది దుర్మరణం