మహారాష్ట్రలోని పుణె- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాతారా జిల్లా కరాడ్ ప్రాంతం వద్ద రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు రెజ్లర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కోల్హాపూర్‌లో జరిగిన కుస్తీ పోటీల్లో పాల్గొని పుణెకు తిరుగుపయనమైన రెజ్లర్ల జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు కార్లు పోటాపోటీగా దూసుకెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలిపారు పోలీసులు.
మృతులు పుణెలోని కత్రాజ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
ఇదీ చూడండి: 'రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించండి'