జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటును(infiltration in kashmir) భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బరాముల్లా జిల్లా(Jammu Kashmir News) ఉరి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. అనంతరం వారి నుంచి భారీ మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.
![infiltration in kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13149952_weapons.jpg)
"నియంత్రణ రేఖ వెంబడి హత్లంగ ప్రాంతంలో ముష్కరులు చొరబాటుకు యత్నించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపి ముగ్గురు ముష్కరులను హతమార్చాం." అని ఓ ఆర్మీ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి ఐదు ఏకే-47, ఎనిమిది తుపాకులు, 70 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
![infiltration in kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13149952_grenades.jpg)
![infiltration in kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13149952_guns.jpg)
ఈ మధ్యకాలంలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయని లెఫ్ట్నెంట్ జనరల్ డీ పీ పాండే తెలిపారు. 'ఏడాది ప్రారంభం నుంచి ఉగ్ర చొరబాటు యత్నాలు తగ్గినప్పటికీ.. ఈ మధ్య లాంఛ్ ప్యాడ్ల వద్ద కార్యకలాపాలు పెరిగాయి. పాక్ సైన్యం సాయం లేకుండా ఈ కార్యకలాపాలు జరిగే అవకాశం లేదు' అని పాండే అన్నారు.
ఇదీ చదవండి: