ETV Bharat / bharat

3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం - మరగుజ్జుల వివాహం

కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు అడుగుల వరుడు రెండు అడుగుల వధువు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం ఘనంగా జరిగింది. వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ నవ దంపతుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

3 feet groom, 2 feet bride
వధువుకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తున్న వరుడు
author img

By

Published : Nov 29, 2021, 4:20 PM IST

Updated : Nov 30, 2021, 11:37 AM IST

విష్ణు, జ్యోతి వివాహం

ఆటంకాలను అధిగమించి ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద ఎప్పుడూ మనం వినేదే అయినా ఈ పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. 3 అడుగుల వరుడు (3 feet groom in karnataka ), 2 అడుగుల వధువు (2 feet bride in karnataka )మెడలో తాళి కట్టాడు. కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లాలోని చింతామణి తాలూకాలో ఉన్న కైవార యోగి నారాయణ ఆలయంలో విష్ణు, జ్యోతి వివాహం జరిగింది. వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు.

3 feet groom, 2 feet bride
విష్ణు, జ్యోతి వివాహం
3 feet groom, 2 feet bride
వధువుకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తున్న వరుడు
3 feet groom, 2 feet bride
వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ప్రత్యేక జంట
3 feet groom, 2 feet bride
యోగి నారాయణ ఆలయంలో విష్ణు, జ్యోతి

బెంగళూరుకు చెందిన విష్ణు, కోలార్‌కు చెందిన జ్యోతిలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. చాలా రోజులుగా వీరి కుటుంబ సభ్యులు అమ్మాయి-అబ్బాయి కోసం వెతుకుతున్నారు. అయితే వారు మరుగుజ్జులు కావడంతో అందరూ తిరస్కరించారు. చివరగా విష్ణు కుటుంబానికి, జ్యోతి కుటుంబానికి తెలిసిన ఒక మ్యారేజ్​ బ్రోకర్ ద్వారా ఒకరినొకరు తెలుసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఈ వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపారు.

ఈ క్యూట్-స్పెషల్ పెయిర్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదీ చూడండి: ఎన్​సీపీ మహిళా ఎంపీతో స్టెప్పులేసి అలరించిన శివసేన ఎంపీ రౌత్​

Last Updated : Nov 30, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.