ETV Bharat / bharat

Black Fungus: 28 వేలు దాటిన కేసులు

దేశవ్యాప్తంగా మొత్తం 28,252 బ్లాక్​ఫంగస్ (మ్యూకర్​మైకోసిస్) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్​వర్ధన్ తెలిపారు. వీటిలో 86 శాతం కరోనా రోగుల్లో, 62.3 శాతం కేసుల మధుమేహ వ్యాధి ఉన్నవారిలో వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.

28,252 mucormycosis cases reported from 28 states/UTs: Health minister Vardhan
బ్లాక్ ఫంగస్
author img

By

Published : Jun 7, 2021, 9:03 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మందికి కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతపై వర్చువల్‌ పద్ధతిలో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

దేశంలో ఇప్పటివరకు నమోదైన మ్యుకర్‌మైకోసిస్‌ కేసుల్లో 86శాతం (24,370కేసులు) కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారివేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) కేసులు మధుమేహులకు చెందినవని వెల్లడించారు. మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా 6339 కేసులు నమోదుకాగా, గుజరాత్‌లో 5486 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక సెకండ్‌ వేవ్‌ సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందని, కోలుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 83శాతం క్రియాశీల కేసులు 10రాష్ట్రాల్లో ఉండగా, మరో 17శాతం కేసులు 26రాష్ట్రాల్లో ఉన్నట్లు వెల్లడించారు.

6.34శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

'దేశంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా.. గడిచిన రెండు నెలల్లో కనిష్ఠ కేసులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 2624 కేంద్రాల్లో వీటిని చేపడుతున్నాం. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6.34శాతానికి తగ్గింది. గడిచిన పది రోజులుగా పాజిటివిటీ రేటు 10శాతానికి తక్కువగానే ఉంటోంది' అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్‌ మార్పులకు సంబంధించిన జన్యుక్రమాన్ని విశ్లేషించే ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు 30వేల శాంపిళ్లను పరీక్షించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకర్‌మైకోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాలని మే 20న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ వీటిని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ముందే గుర్తిస్తే.. మందులతోనే నయం!

ఇదీ చదవండి: కరోనా సోకకపోయినా.. బ్లాక్ ఫంగస్ బారినపడ్డ బాలుడు

యూడీఐడీ కార్డుతో దివ్యాంగులకు టీకాలు..

టీకాలు పొందాలనుకునే దివ్యాంగుల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫొటో ఐడీ పత్రాల జాబితాలో 'యూడీఐడీ'(యూనిక్ డిసేబిలిటీ​ ఐడీ) కార్డును చేర్చాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. త్వరలో కొవిన్‌ యాప్​లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

'యూడీఐడీ' కార్డు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దివ్యాంగులకు ఈ కార్డు జారీ చేస్తుంది.

ఇవీ చదవండి: Black Fungus: మెదడుకూ పాకిన వ్యాధి

ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.