ETV Bharat / bharat

తిహార్​ జైలులో 2,400 మంది ఖైదీలు మిస్సింగ్​!

author img

By

Published : Mar 19, 2022, 1:10 PM IST

Tihar jail: తిహార్ జైళ్లలో 2,400 మంది ఖైదీలు పెరోల్​పై వెళ్లి ఇంకా తిరిగి రాలేదని అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ప్రకటించారు. కరోనా తొలి దశలో వీరంతా విడుదలయ్యారు.

2400 inmates missing after covid parole
కొవిడ్ పరోల్​ తర్వాత 2400మంది ఖేదీలు మిస్సింగ్​!

Tihar jail inmates missing: కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్​ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. ఒకటిన్నరేళ్లుగా పరారీలో ఉన్న మిగతావారి ఆచుకీ తెలిపిన వారికి బహుమానం ఇస్తామని దిల్లీ పోలీసులు ప్రకటించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Tihar jail prisoners parole

కరోనా రెండో దశలోనూ మరో 5,000 మంది ఖైదీలకు పెరోల్​ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు కూడా ఇంకా సరెండర్ కావాల్సి ఉంది. అయితే ఈ ఖైదీలు తిరిగి రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.

Tihar jail news

2020-21 కరోనా తొలి దశలో తిహార్ జైళ్లో వైరస్​ విజృంభించింది. 521మంది ఖైదీలు, 534 మంది సిబ్బంది దీని బారినపడ్డారు. దీంతో 6,000 మందికి పెరోల్​ మంజూరు చేశారు అధికారులు. అయితే వీరంతా 2021లో సరెండర్ కావాల్సి ఉండగా.. వారిలో 2,400 మంది ఇంకా జైలుకుతిరిగి రాలేదు.

కరోనా రెండో వేవ్ 2021 మార్చిలో మరో 5000 మందికి పెరోల్ మంజూరు చేశారు అధికారులు. అయితే వారు సరెండర్ కావాలని కోర్టు ఆదేశాల చేయాల్సి ఉంది.

కరోనా సయమంలో తిహార్ జైళ్లో 10 మంది మరణించారు. వారిలో బీహార్​కు చెందిన ఆర్​జేడీ నాయకుడు మహ్మద్ షహబుద్దిన్​ కూడా ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు కూడా కోవిడ్ సోకింది. అయితే అతను కోలుకున్నాడు. ప్రస్తుతం తిహార్​, మండోలి, రోహిణి జైళ్లలో 18,000 మంది ఖైదీలు అత్యంత భద్రత నడుమ ఉన్నారు. ఒక్క కరోనా కేసు కూడా లేదు.

ఇదీ చదవండి: యువకులపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆగ్రహంతో స్థానికుల విధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.