గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం 24 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. రాష్ట్రంలో చేపట్టిన 'లోన్ వరట్టు' పథకం కింద వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
![24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10393067_vlcsnap-2021-01-27-03h21m51s061.png)
ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయిన ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవం నిర్వహించారు పోలీసులు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నక్సల్స్‌తో కలిసి జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బంది స్టెప్పులేశారు. చప్పట్లు కొడుతూ వారితో ఆడిపాడారు.
![24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10393067_vlcsnap-2021-01-27-03h21m45s084.png)
![24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10393067_vlcsnap-2021-01-27-03h22m21s905.png)
![24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10390243_img.png)
లొంగిపోయిన నక్సలైట్లలో ముగ్గురిపై రూ. లక్ష రివార్డు ఉందని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. లోన్ వరట్టు కార్యక్రమంలో భాగంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. గతేడాది 225 మంది నక్సల్స్ లొంగిపోగా.. వీరందరికీ వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. నక్సల్స్ ధ్వంసం చేసిన రోడ్లు, బడులు, బ్రిడ్జిల పునర్నిర్మాణంలో వీరికి పని కల్పించినట్లు తెలిపారు.