బంగాల్ శాసనసభ ఎనిమిదో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఎనిమిదో దశలో పోటీ చేస్తున్న 283 మంది అభ్యర్థుల్లో 23 శాతం మందిపై నేరచరిత్ర ఉన్నట్లు స్పష్టం చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి ఓ నివేదికను సమర్పించింది.
నివేదికలోని వివరాలు ఇలా..
- 283 మంది అభ్యర్థుల్లో 64 మంది అభ్యర్థులు(23 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
పార్టీ | క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు | శాతం |
సీపీఐ(ఎం) | 7 | 70 |
టీఎంసీ | 11 | 31 |
భాజపా | 21 | 60 |
కాంగ్రెస్ | 10 | 53 |
- 50 మంది అభ్యర్థులు(18 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ తెలిపింది.
- 12మంది అభ్యర్థులు.. మహిళలపై నేరారోపణలకు సంబంధించిన కేసులు తమపై ఉన్నట్లు ప్రకటించారు.
- ఆరుగురు అభ్యర్థులు తమపై హత్య కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
- 17 మంది అభ్యర్థులు హత్యాయత్నం కేసులున్నట్లు చెప్పారు.
- 55 మంది(19 శాతం) అభ్యర్థులు తాము కోటీశ్వరులమని వెల్లడించారు.
- 52 మంది(54 శాతం) మంది తమ విద్యార్హత 5వ తరగతి, 12 వ తరగతి మధ్య ఉన్నట్లు తెలిపారు. 127 మంది(45 శాతం) తాము గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'వీడ్కోలు పలకడం అనేది కష్టమైన పని'
ఇదీ చూడండి: 'కరోనాను వదిలేసి.. సెంట్రల్ విస్టాకు టెండర్లా?'