ETV Bharat / bharat

30 అత్యంత కాలుష్య నగరాల్లో 22 భారత్​లోనే..

author img

By

Published : Mar 17, 2021, 10:28 AM IST

Updated : Mar 17, 2021, 12:37 PM IST

ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 22 భారత్​లోనే ఉన్నాయని 'ప్రపంచ వాయు నాణ్యత' నివేదికలో తేలింది. అత్యంత కాలుష్యమైన రాజధాని జాబితాలో దిల్లీ ప్రథమ స్థానంలో ఉందని ఆ నివేదిక చెప్పింది.

22 of world's 30 most polluted cities are in India: Report
'భారత్​లోనే 22 అత్యంత కాలుష్య నగరాలు'

ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య నగరాల్లో 22 భారత్​లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్యమైన రాజధానుల జాబితాలో దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఈ మేరకు ఓ నివేదికలో తేలింది. స్విట్జర్లాండ్​కు చెందిన ఐక్యూ ఏయిర్​ అనే సంస్థ 'ప్రపంచ వాయు నాణ్యత 2020' పేరుతో ఈ నివేదికను వెలువరించింది.

అత్యంత కాలుష్య నగరాల జాబితాలో దిల్లీ 10వ స్థానంలో ఉందని నివేదిక చెప్పింది. అయితే.. దిల్లీలో వాయు నాణ్యత 2019తో పోలిస్తే 2020లో 15 శాతం పెరిగిందని పేర్కొంది.

నివేదికలోని కీలకాంశాలు..

  • ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో చైనాలోని షింజియాంగ్​ ప్రథమ స్థానంలో ఉండగా.. మిగతా 9 నగరాలు భారత్​లో ఉన్నాయి.
  • షింజియాంగ్​ తర్వాత ఘాజియాబాద్​ రెండో స్థానంలో ఉంది.

భారత్​లోని 21 అత్యంత కాలుష్య నగరాలు..

ఘాజియాబాద్​, బులంద్​షహర్, బిస్రాఖ్ జలాల్​పుర్, ​నోయిడా, గ్రేటర్​ నోయిడా, కాన్పుర్​, లఖ్​నవూ, మేరఠ్​, ఆగ్రా, ముజఫర్​నగర్, ​భివారి, ఫరీదాబాద్, ​జింద్, హిసార్, ​ఫతేహాబాద్​, బంద్వారీ, గురుగ్రామ్​, యమునా నగర్,​ రోహ్​తక్, ​ధరుహోరా, ముజఫర్​పుర్​.

రవాణా, కట్టెలపొయ్యి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణాలు, వ్యర్థాల దహనం వంటివి భారత్​లో వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలని నివేదిక చెప్పింది.

106 దేశాల నుంచి అందిన పీఎం 2.5 డేటా ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను వెలువరించారు.

ఇదీ చూడండి:ఉగ్రవాదం వైపు యువత.. అడ్డుకున్న పోలీసులు

Last Updated : Mar 17, 2021, 12:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.