ETV Bharat / bharat

రాజస్థాన్‌లో బ్లాక్​ ఫంగస్​ పంజా- ఇద్దరు మృతి - రాజస్థాన్​లో బ్లాక్​ ఫంగస్​

రాజస్థాన్ పాలీ జిల్లాలో బ్లాక్​ ఫంగస్​ బారిన పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జోధ్​పుర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ వారు మరణించారని అధికారులు తెలిపారు.

black fungus
బ్లాక్​ ఫంగస్​
author img

By

Published : May 23, 2021, 9:56 AM IST

Updated : May 23, 2021, 10:05 AM IST

చాపకింద నీరులా బ్లాక్​ ఫంగస్(మ్యుకోర్​మైకోసిస్​)​ విజృంభిస్తోంది. రాజస్థాన్​ పాలీ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఈ శిలీంధ్ర వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ.. జోధ్​పుర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

పాలీ జిల్లా సర్గోవాలా ఆరత్​కు చెందిన 35 ఏళ్ల యువకుడికి బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపించగా.. జోధ్​పుర్​ ఎయిమ్స్​లో శుక్రవారం చేరాడు. శనివారం రాత్రి అతడు చికిత్స పొందుతూ మరణించాడు. సమేర్​పుర్​ కోలివాడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి మే 15న ఎయిమ్స్​లో చేరాడు. శనివారం ఉదయం ఆయనా ప్రాణాలు కోల్పోయాడు.

బ్లాక్​​ ఫంగస్​ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో పాలీ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షణాలు కనిపించిన వెంటనే.. చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య

Last Updated : May 23, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.