ETV Bharat / bharat

'గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​' రేసులో హైదరాబాదీ

బిహార్​కు చెందిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యం మిశ్రా, హైదరాబాద్​కు చెందిన ఇంగ్లీష్​, సోషల్​ టీచర్​ మేఘన ముసునూరి.. ప్రఖ్యాత 'గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​' టాప్​-50 జాబితాలో చోటుదక్కించుకున్నారు(global teacher prize 2021). ఇందులో ఫైనలిస్ట్​గా నిలిచిన వారికి 1మిలియన్​ డాలర్లు అందుతాయి. గతేడాది కూడా ఈ ప్రైజ్​ భారతీయుడినే వరించింది.

2021 Global Teacher Prize
గ్లోబల్​ టీచర్​ ప్రైజ్
author img

By

Published : Sep 9, 2021, 5:21 PM IST

ఇద్దరు భారత ఉపాధ్యాయులు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఈ ఏడాది.. ప్రఖ్యాత 'గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​'కు(global teacher prize 2021) ఎంపిక చేసిన టాప్​ 50 మంది జాబితాలో బిహార్​కు చెందిన సత్యం మిశ్రా, హైదరాబాద్​కు చెందిన మేఘన ముసునూరి ఉన్నారు. ఈ ప్రైజ్​ దక్కితే 1 మిలియన్​ డాలర్​ వీరి సొంతమవుతుంది.

బిహార్​ భగల్​పుర్​లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా సత్యం విధులు నిర్వర్తిస్తుండగా.. మేఘన సోషల్​, ఇంగ్లీష్​, గణితంలో టీచర్​గా ఉన్నారు. 121 దేశాల నుంచి 8వేల నామినేషన్లు వెళ్లగా.. టాప్​ 50లో వీరు ఉండటం విశేషం.

యునెస్కో భాగస్వామ్యంతో వర్కీ ఫౌండేషన్​ ఈ గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​ను ఏటా ఇస్తుంది. 'విద్యకు ప్రాధాన్యమిస్తేనే.. భావితరాలకు భద్రత ఉంటుంది,' అన్న ఉద్దేశంతో వర్కీ ఫౌండేషన్​ పనిచేస్తుంది.

ప్రపంచాన్ని విద్యార్థులు చూసే కోణాన్ని మార్చేందుకు, తన లెక్కల 'ట్రిక్స్'​తో విద్యార్థులను చదువును సులభం చేసినందుకు సత్యం ఎంపికయ్యారు. మరోవైపు ఫౌంట్​హెడ్​ గ్లోబల్​ స్కూల్​ అండ్​ జూనియర్​ కళాశాల ఫౌండర్​గా, ఓ ఔత్సాహి పారిశ్రామికవేత్తగా, దాతృత్వ భావనలున్న వ్యక్తిగా మేఘన.. ఈ ప్రైజ్​ టాప్​-50 లిస్ట్​లో చోటు దక్కించుకున్నారు.

నవంబర్​లో పారిస్​లో జరిగే వేడుకలో విజేతలను గ్లోబల్​ టీటర్​ ప్రైజ్​ అకాడమీ ప్రకటిస్తుంది. గతేడాది మహారాష్ట్రకు చెందిన రంజిత్​సిన్హ్​ దిశాలేకు ఈ ప్రైజ్​ వరించింది(global teacher prize 2020 winner).

ఇదీ చూడండి:- గురుశిష్యుల బంధం.. అమోఘం.. అద్వితీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.