ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో రెండు ఏనుగులు మృతి చెందాయి. బిర్సా ప్రాంతంలోని మహిపాని వద్ద బుధవారం రాత్రి ట్రాక్ దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్ రైలు ఢీకొట్టగా.. ఈ ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడం వల్ల.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. ఏనుగుల కళేబరాలను తొలగించి ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం