ETV Bharat / bharat

2.80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా పంపిణీ అయిన కరోనా టీకా డోసుల సంఖ్య 2.80 కోట్లకు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రం వరకు 18.40 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది. ఇందులో 14.64 లక్షల మంది తొలి డోసు, 3.76 లక్షల మంది రెండో డోసు స్వీకరించారని స్పష్టం చేసింది.

VACCINE
2.80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
author img

By

Published : Mar 13, 2021, 5:35 AM IST

ఓ వైపు దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్నా.. మరోవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం రాత్రి నాటికి దేశ వ్యాప్తంగా పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 2,80,08,817కు చేరింది.

కేంద్ర వైద్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం ఒక్కరోజే(రాత్రి 8 వరకు) 18.40 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఇందులో 14.64 లక్షల మందికి తొలి డోసు, 3.76 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. తొలి డోసు తీసుకున్నవారిలో 60 ఏళ్ల పైబడినవారు 11.08 లక్షల మంది ఉండగా.. వైద్య సమస్యలు ఉన్న 45-60 ఏళ్ల వ్యక్తులు 2 లక్షల మంది ఉన్నారు.

ఇప్పటివరకు 72.84 లక్షల మంది వైద్య సిబ్బందికి, 72.15 లక్షల ఫ్రంట్​లైన్ వర్కర్లకు కరోనా టీకా తొలి డోసు అందింది. 41.76 లక్షల మంది వైద్య సిబ్బంది, 9.28 లక్షల మంది ఫ్రంట్​లైన్ కార్మికులు రెండో డోసు అందుకున్నారు.

ఇదీ చదవండి: ముంబయిలో 90శాతం కేసులు ఆ ప్రాంతాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.