మహారాష్ట్రలో (Train Derail in Maharashtra) ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోనావాలా స్టేషన్ ప్లాట్ఫామ్ వద్దకు చేరుకునే సమయంలో ఇందోర్-దౌండ్ ప్రత్యేక రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి (Train Derailed). ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలు కాలేదని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) తెలిపారు.
![coaches](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-av-express-mh10024_27092021092404_2709f_1632714844_993.jpg)
ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు (Train News) ముమ్మరం చేశారు. లోనావాలాలోని మిగిలిన రైలు మార్గాలకు ఇబ్బందిలేదని వెల్లడించారు. దెబ్బతిన్న పట్టాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: పట్టాలు తప్పిన రైలు- ముగ్గురు ప్రయాణికులు మృతి