ETV Bharat / bharat

టీచర్​ లైంగిక వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య - విద్యార్థినికి టీచర్​ లైంగిక వేధింపులు

ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని (Student Suicide) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​లో జరిగింది.

school girl suicide
విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Nov 12, 2021, 7:18 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​లో దారుణం జరిగింది. ప్లస్​ టూ చదివే 17 ఏళ్ల విద్యార్థిని ఇంట్లోనే ఆత్మహత్య (Student Suicide) చేసుకుంది. బాలిక మరణానికి స్కూల్​లో పని చేసే ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించడమే కారణం అని తల్లిదండ్రులు ఆరోపించారు. టీచర్​ పదేపదే వేధింపులకు గురి చేయడం వల్ల బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే విషయం పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్​ నోట్​లో కూడా ఉందని పేర్కొన్నాయి.

టీచర్​ వేధిస్తున్న విషయం తమ కూతురు చెప్పకుండా పాఠశాలను మార్చమని అడిగినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బాలిక కోరిక మేరకు ఈ సెప్టెంబర్​లో వేరే పాఠశాలలో చేర్చినట్లు చెప్పారు. అయినప్పటికీ.. ఆ ఉపాధ్యాయుడు అసభ్యకరమైన మెసేజ్​లు చేసే వాడని బాలిక స్నేహితురాలు ఒకరు తెలిపారు.

విద్యార్థిని ఆత్మహత్యపై తల్లిదండ్రులు కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: నిధి కోసం పూజలు.. మహిళను వివస్త్రను చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.