ETV Bharat / bharat

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం​- 18 మంది మృతి - రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి

అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలిస్తున్న వ్యాన్​- ఓ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతిచెందారు. బంగాల్​లోని ఫుల్బరీ హైవేలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

bengal accident news
ట్రక్కును ఢీకొన్న వ్యాన్​- 17 మంది మృతి
author img

By

Published : Nov 28, 2021, 9:51 AM IST

Updated : Nov 28, 2021, 10:58 AM IST

బంగాల్​లోని నదియా జిల్లా హన్​స్ఖలీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్​, ట్రక్కు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

bengal accident news
చికిత్స పొందుతున్న బాధితుడు

అంత్యక్రియలకు వెళ్తూ..

మృతిచెందిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహంతో సహా వ్యాన్​లో బయలుదేరారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఆగిఉన్న ఓ ట్రక్కును వ్యాన్​ ఢీకొంది. దట్టమైన పొగమంచు ఉండటం సహా అతివేగం ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఫుల్బరీ హైవేపై జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bengal accident news
రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన ట్రక్

గవర్నర్​ సంతాపం..

నదియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్​ జగదీప్ ధన్​కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి : mohan bhagwat news: 'దేశ విభజనకు ముఖ్య కారణం అదే'

Last Updated : Nov 28, 2021, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.