సెల్ఫీ తీసుకుందామని ఓ 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జోకట్టే రైల్వే స్టేషన్లో జరిగింది. బాధితుడిని మహ్మద్ దిశాన్గా పోలీసులు గుర్తించారు. అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
![electrocuted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11405738_fjijg_1504newsroom_1618472671_505.jpg)
దిశాన్ శరీరం 50 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సీబీఐకి ఇస్రో గూఢచర్యం కేసు