ETV Bharat / bharat

అఫ్గాన్​ నుంచి వచ్చిన 78 మందిలో 16 మందికి కరోనా - దేశంలో కరోనా తాజా వార్తలు

అఫ్గానిస్థాన్‌(Afghan news) నుంచి భారత్​కు తరలిస్తున్న వారిలో కరోనా(Corona Virus) పాజిటివ్​గా నిర్ధరణ కావడం కలకలం రేపుతోంది. మంగళవారం దిల్లీ చేరుకున్న 78 మందిలో 16 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

corona in afghan evacuees
అఫ్గాన్​ నుంచి వచ్చిన వారికి కరోనా
author img

By

Published : Aug 25, 2021, 9:55 AM IST

Updated : Aug 25, 2021, 11:25 AM IST

కల్లోలిత అఫ్గానిస్థాన్‌(Afghan news) నుంచి భారత్‌కు వచ్చిన వారిలో 16 మంది కరోనాతో(Corona Virus) బాధపడుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాబుల్‌ నుంచి మంగళవారం 78 మంది దిల్లీకి చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు వీరిని దిల్లీలోని ఛావ్లాలో ఏర్పాటు చేసిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అనంతరం కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది.

కేంద్ర మంత్రి కూడా...

కరోనా బాధితుల్లో ముగ్గురు సిక్కులు ఉన్నారు. వీరు అఫ్గాన్‌(Afghan news) నుంచి సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్‌ సాహిబ్‌ పత్రాలను తీసుకొచ్చారు. ఈ పత్రాలను దిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి అందుకున్నారు. దీంతో కరోనా(Corona Virus) సోకిన వ్యక్తుల కాంటాక్ట్‌లో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారందరికీ ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే చికిత్స నిమిత్తం వీరిని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిసింది. మరోవైపు అఫ్గాన్‌ నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఈ మిషన్‌కు ఆపరేషన్‌ దేవీ శక్తి (Operation Devi Shakti) అని పేరు పెట్టారు. భారత పౌరులతో పాటు అఫ్గాన్‌లోని మైనార్టీలైన సిక్కులు, హిందువులను కూడా మానవతా దృక్పథంతో ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800కు పైగా మందిని భారత్‌.. అఫ్గాన్‌ నుంచి తరలించింది.

ఇదీ చూడండి: Delta Variant: ''డెల్టా'తో వైరల్ లోడు 300 రెట్లు అధికం'

ఇదీ చూడండి: టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే!

Last Updated : Aug 25, 2021, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.