ఎవరికైనా కళ్లకు గంతలు కడితే చీకటి కనిపిస్తుంది. కానీ ముంబయిలోని ముంబ్రాకు చెందిన 15ఏళ్ల అఫాన్ కళ్లకు గంతలు కడితే.. అతని అసాధారణ ప్రతిభ బయటపడుతుంది. అవును.. కళ్లు మూసుకొని సెకన్స్‌లో ర్యూబిక్స్ క్యూబ్ పజిల్‌ను పూర్తి చేయటంలో అతను దిట్ట. క్షణాల్లోనే 'ఈటీవీ భారత్' పేరును రూబిక్ క్యూబ్‌తో రాసి ఔరా అనిపించాడు. 15 ఏళ్లకే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.
ఆటలోనే కాదు మాటలోనూ..

అఫాన్.. కేవలం ర్యూబిక్స్ క్యూబ్ పజిల్లోనే కాదు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లోనూ నైపుణ్యం ఉంది. ప్రస్తుతం అతను ఓ విజయవంతమైన వక్తగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో ప్రసంగించాడు.
ఫోన్ వదిలి ప్రాక్టీస్..

గతంలో తాను మొబైల్ ఫోన్‌కు అలవాటు పడ్డానని.. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సెల్‌ఫోన్ వదిలి ఈ ఆటను ప్రాక్టీస్ చేయటం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు అఫాన్.
ఇదీ చదవండి : ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!