ETV Bharat / bharat

14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, తీవ్రంగా కొట్టి, రోడ్డుపై వదిలేసి

అత్యాచారాన్ని అడ్డుకుందని.. 14 బాలికను తీవ్రంగా కొట్టి రోడ్డు పక్కన విడిచి పెట్టిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. ఒక రాత్రి మొత్తం అక్కడే పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

rape
రేప్​
author img

By

Published : Aug 21, 2022, 11:07 PM IST

అత్యాచారాన్ని అడ్డగించిన 14 ఏళ్ల బాలికను తీవ్రంగా కొట్టి రోడ్డు పక్కన విడిచి పెట్టిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. ఒక రాత్రి మొత్తం అక్కడే పడి ఉన్న బాలిక మరుసటి రోజు రోడ్డుపైకి వచ్చి సహాయం కోరింది. బాలికను ఆసుపత్రిలో చేర్చిన కొందరు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆ బాలికతో పాటు ఆమె అమ్మమ్మ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మేనమామ ఇంటికని బయలుదేరిన తనపై ఓ ఆటో డ్రైవర్​ అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం బాలిక దుమ్కా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం..
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు బాలిక శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఓ ఆటో డ్రైవర్‌ ముందుకొచ్చాడు. అందులో మరొక అమ్మాయి అప్పటికే కూర్చుంది. అరగంట ప్రయాణం చేసిన తర్వాత డ్రైవర్ వారిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆటోలో ఉన్న మరో మహిళ తప్పించుకుని పారిపోగా.. 14 ఏళ్ల బాలిక అతని చేతికి చిక్కింది. అత్యాచారాన్ని ఖండించిన బాలికను అతను తీవ్రంగా కొట్టి.. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన పడేశాడు. కాళ్లు విరిగిన బాలిక కదలలేని స్థితిలో రాత్రంతా అక్కడే ఉండి.. ఉదయాన్నే కాళ్లు ఈడ్చుకుంటూ సహాయం కోరుతూ కేకలు వేసింది. బాలికను స్థానికులు గుర్తించి మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఇవీ చదవండి

సీఎం కాన్వాయ్​పై దాడి, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం

12ఏళ్ల బాలికకు కడుపు నొప్పి, ఆస్పత్రికి వెళ్తే ప్రసవం, రేపిస్ట్ కోసం వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.