ETV Bharat / bharat

ఆ విమానంలో భారత్​కు వచ్చిన 125 మందికి కరోనా - అమృత్​సర్​ విమానాశ్రయం కరోనా

Amritsar Airport Covid Test: ఇటలీ నుంచి పంజాబ్​కు వచ్చిన ఛార్టెర్డ్​ విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో మొత్తం 179 మంది భారత్​కు వచ్చారన్నారు.

air india
కరోనా
author img

By

Published : Jan 6, 2022, 3:13 PM IST

Updated : Jan 6, 2022, 3:51 PM IST

Amritsar Airport Covid Test: ఇటలీలోని మిలాన్ నుంచి పంజాబ్​లోని అమృత్​సర్​కు వచ్చిన ఓ అంతర్జాతీయ ఛార్టెర్డ్​ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఎయిర్​పోర్ట్​ డైరెక్టర్​ వీకే సేఠ్ గురువారం వెల్లడించారు. విమానంలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 179గా ఉందని పేర్కొన్నారు. వీరిలో 19 మంది పిల్లలు కాగా.. వారికి ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు. మిగిలిన 160 మందికి పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Amritsar Airport Covid Test
విమానాశ్రయానికి చేరుకున్న అంబులెన్సులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు తప్పనిసరి చేశారు. మరోవైపు పలు రాష్ట్రాలు విదేశాలకు విమాన రాకపోకలపై ఇప్పటికే ఆంక్షలను అమలు చేశాయి. బంగాల్​లో వారానికి రెండుసార్లు మాత్రమే యూకేకు విమాన రాకపోకలను అనుమతించింది అక్కడి ప్రభుత్వం.

Amritsar Airport Covid Test
అమృత్​సర్​ విమానాశ్రయం

ఇటీవల.. క్రూయిజ్​ షిప్​లో ముంబయి నుంచి గోవాకు వచ్చిన ​ప్రయాణికుల్లో కూడా భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం 2000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా 66 మంది కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

Amritsar Airport Covid Test
అమృత్​సర్​ విమానాశ్రయం

ఇదీ చూడండి : 'వర్చువల్​ ర్యాలీలు, ఆన్​లైన్​ ఓటింగ్​ సాధ్యమేనా?'.. ఈసీకి హైకోర్టు ప్రశ్న

Last Updated : Jan 6, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.