ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక.. మద్యం కోసం సొంతవారినే..!

ఓ మైనర్..​ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటన హరియాణా కర్నాల్​లో జరిగింది. మరోవైపు.. మద్యానికి బానిసైన ఓ యువకుడు సొంత అవ్వ, తాతలనే చంపిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బదాయూలో జరిగింది.

12-year-old-minor-gave-birth-to-a-child-in-kalpana-chawla-hospital-karnal haryana

author img

By

Published : Jun 26, 2022, 4:04 PM IST

Minor Girl Birth to Child: 12 ఏళ్ల బాలిక.. ఓ శిశువుకు జన్మనిచ్చిన ఘటన హరియాణాలోని కర్నాల్​లో జరిగింది. ఈ విషయం తెలుసుకొని షాకైన పోలీసులు.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. అవమానంతో పరువు పోతుందనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఆ భయంతోనే బిహార్​కు చెందిన బాధిత కుటుంబం.. కర్నాల్​కు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

కర్నాల్​లోని మురికివాడలో కుటుంబంతో కలిసి నివసిస్తోంది బాధితురాలు. మురికివాడ ప్రజలకు ఆవాసం కల్పించేందుకు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న అధికారులు.. 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చడం గురించి తెలుసుకుని చైల్డ్​ వెల్ఫేర్​ కమిషన్​కు సమాచారం అందించారు. వారు.. బాధితురాలిని కల్పనా చావ్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా.. బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పోలీసుల జోక్యంతో భయపడిన బాధిత కుటుంబం మళ్లీ బిహార్​కు వెళ్లిందని సమాచారం.

Grandparents Killed: ఉత్తర్​ప్రదేశ్​ బదాయూలో దారుణ ఘటన జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని సొంత అవ్వ, తాతను హత్య చేశాడు 20 ఏళ్ల యువకుడు. అనంతరం.. వారి మృతదేహాలను రెండు వేర్వేరు గదుల్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. జూన్​ 22న హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది: హిమేశ్​ తన అవ్వ భావన్​ దేవీ(60), తాత ప్రేమ్​ శంకర్​తో (65) కలిసి దిల్లీలో నివాసముంటున్నాడు. వీరంతా.. తమ స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​లోని దామ్రీ గ్రామానికి జూన్​ 22న ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. మద్యానికి బానిసైన హిమేశ్​ డబ్బులు ఇవ్వలేదని.. వారితో గొడవపడి హత్య చేశాడు.

రైతు హత్య: ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లోని ఫుగానా గ్రామంలో 42 ఏళ్ల రైతు సత్యేంద్ర కుమార్​ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంపారు. దీనికి నిరసనగా.. నిందితుల్ని అరెస్టు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. నిందితుల కోసం వెతుకుతున్నారు.

ఇవీ చూడండి: రంగంలోకి రష్మీ.. ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెరవెనుక రాజకీయం!

పాపకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక​.. 12 ఏళ్ల బాలుడు అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.