ETV Bharat / bharat

11మంది ఉన్నతాధికారులకు కరోనా​.. ఒకరు పరార్​! - ధార్వాడ్​ కోరనా కేసులు

ఉత్తరాఖండ్​లోని ఎఫ్​ఆర్​ఐలో కరోనా కలకలం సృష్టించింది. శిక్షణ కోసం వెళ్లిన 11మంది ఐఎఫ్​ఎస్​ అధికారులకు కొవిడ్​ సోకింది(fri dehradun covid news). కరోనా పాజిటివ్​ అని తేలిన వెంటనే ఓ సీనియర్​ అధికారి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.

fri dehradun covid cases, కొవిడ్​ కేసులు
ఆ 11మంది అధికారులకు కొవిడ్​ పాజిటివ్​.. ఒకరు పరార్​!
author img

By

Published : Nov 25, 2021, 5:30 PM IST

ఉత్తరాఖండ్​లో 11మంది ఐఎఫ్​ఎస్ అధికారులకు కరోనా పాజిటివ్​గా తేలింది. దెహ్రాదూన్​లోని ఎఫ్​ఆర్​ఐ(ఫారెస్ట్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​)లో శిక్షణ కోసం వచ్చిన వీరు కరోనా బారినపడ్డారు(fri dehradun covid news). ఈ వ్యవహారం రాష్ట్ర ఆరోగ్య విభాగంలో కలకలం రేపింది.

ఈ 11మంది లఖ్​నవూ నుంచి దిల్లీ మీదుగా దెహ్రాదూన్​ వచ్చారు. దిల్లీలో వారికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. దెహ్రాదూన్​ ఎఫ్​ఆర్​ఐకి చేరుకున్న అనంతరం రిపోర్టులు వచ్చాయి. వారికి కరోనా నిర్ధరణ అయ్యింది.

11మంది నివాసమున్న టిబెటన్​ కాలనీ, ఎఫ్​ఆర్​ఐలోని హాస్టల్​ను కంటోన్మెంట్​ జోన్​గా ప్రకటించారు అధికారులు. అయితే ఈ 11మందిలో ఓ సీనియర్​ అధికారి.. తనకు కొవిడ్​ పాజిటివ్​ అని తేలిన వెంటనే అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దెహ్రాదూన్​ జిల్లా మెజిస్ట్రేట్​ ఆర్​ రాజేశ్​ కుమార్​.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఎఫ్​ఆర్​ఐలో కరోనా కేసులు వెలుగుచూడటం ఇది కొత్తేమీ కాదు. 2020 మార్చిలోనే కొందరు అధికారులకు కొవిడ్​ సోకింది. దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని మూసివేశారు.

టీకా తీసుకున్నా...

కర్ణాటక ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్​ వైద్య కళాశాలలో 66మంది విద్యార్థులు కొవిడ్​ బారినపడ్డారు(sdm college covid cases). తొలుత.. కళాశాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న 40మందికి పాజిటివ్​ అని తేలింది. అనంతరం మిగిలిన వారికీ వైరస్​ సోకింది. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారే కావడం గమనార్హం. వీరెవరికీ కరోనా లక్షణాలు లేవు.

అప్రమత్తమైన అధికారులు.. కళాశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్​ పరీక్ష నిర్వహించారు(karnataka covid news). 100కుపైగా మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

sdm medical college
ఎస్​డీఎమ్​ వైద్య కళాశాల

జిల్లా ఆరోగ్య అధికారులు కళాశాలను సందర్శించారు. హాస్టల్​ సహా మొత్తం ప్రాంతాన్ని శానిటైజ్​ చేయాలని ఆదేశాలిచ్చారు.

ఇదీ చూడండి:- 539 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.