ETV Bharat / bharat

రూ.600 చోరీ- రూ.25వేలు జరిమానా​, 10 ఏళ్ల జైలు

చోరీ, యువకుడిపై దాడి కేసులో ఇద్దరికి రూ. 25వేల చొప్పున జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే.. వాళ్లు ఎంత చోరీ చేశారో తెలుసా? రూ.600 మాత్రమే. ఈ సంఘటన హరియాణా ఫతేబాద్​ జిల్లాలో జరిగింది.

Loot case
దోపిడి కేసులో సంచలన తీర్పు
author img

By

Published : Feb 15, 2021, 11:33 AM IST

హరియాణా ఫతేబాద్​ జిల్లాలోని టొహానాలో ఓ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ యువకుడిపై దాడికి పాల్పడి రూ.600 చోరీ చేసిన కేసులో ఇద్దరికి రూ.25వేల చొప్పున జరిమానాతో పాటు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో తమకు న్యాయం జరిగినందుకు మానవ హక్కుల సంఘం, కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు

అసలేం జరిగింది?

2017, నవంబర్​7న తన సోదరుడిపై దాడి చేసి అతని వద్ద నుంచి రూ.600లు చోరీ చేశారని బాధితుడి అన్న ప్రతాప్​ ఖోడ్డా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 నెలల తర్వాత కేసు నమోదు చేసినప్పుటికీ ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత 2018, ఫిబ్రవరి 3న మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు ప్రతాప్​. దాంతో కేసులో పురోగతి కనిపించినట్లు ప్రతాప్​ చెప్పారు. 2021, ఫిబ్రవరి 9న ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ప్రతాప్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.