Yadadri Night Visuals: విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి - Yadadri temple lighting
🎬 Watch Now: Feature Video
Yadadri Night Visuals: విద్యుత్ దీపాల వెలుగుల్లో.. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కోవెల ధగధగ మెరుస్తోంది. బంగారు రంగు దీపాల్లో ఆలయం కళకళలాడుతోంది. యాదాద్రీశుడి ఆలయంలో మహాకుంఠ సంప్రోక్షణ పర్వంలో భాగంగా ప్రధాన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి వేళలో విద్యుద్దీపాల అలంకరణలో.. యాదాద్రి ప్రాంగణం.. ఆకాశంలో తారల మధ్య ఉన్న చందమామని తలపిస్తోంది. డ్రోన్ ద్వారా తీసిన యాదాద్రి విజువల్స్ అందర్ని ఆకర్షిస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST