ఉర్రూతలూగించిన విశాఖ ఉత్సవ్ కార్నివాల్ - విశాఖ ఉత్సవ్ 2019 న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5522758-392-5522758-1577537465532.jpg)
సాగరతీరంలో విశాఖ ఉత్సవ్ 2019 ఘనంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్నివాల్.. నగరవాసులతో పాటు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ కార్నివాల్లో స్థానిక కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న రథం వెనక ఈ కార్నివాల్ సాగింది. కళాకారులతో పాటు పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నేటి తరానికి తెలియని ఎన్నో సంప్రదాయ, జానపద నృత్యాలు కార్నివాల్లో ప్రదర్శించారు.