prathidwani : తుదిదశకు పీఆర్సీపై సంప్రదింపులు.. ఎదురుచూపులు ముగిసినట్లేనా? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
కొద్దిరోజులుగా వాడీవేడిగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం.. అంతిమ అంకానికి చేరింది. విన్నపాలు, నిరసనలు, ఆందోళనల నడుమ... సీఎస్ కమిటీ నివేదిక సమర్పణతో తుది సంప్రదింపులు మొదలయ్యాయి. 14.29% ఫిట్‌మెంట్, రాష్ట్ర వేతన సవరణ కమిషన్ ఉండవన్న మాటతో విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి ముందుకు చేరింది. ఇక నేడో రేపో తుది నిర్ణయం అంటున్న సంకేతాలు రాయబార పర్వం కూడా జోరుగా సాగుతోంది. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏం చేయనున్నాయి. 27% మధ్యంతర భృతి స్థానంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే వారి పరిస్థితి ఏమిటి? వేతన సవరణ, 70కి పైగా డిమాండ్ల సాధనకు సంబంధించి... ఉద్యోగులు - ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.