Pratidwani: ఆన్‌లైన్ గేమ్స్ తో.. తలెత్తే విపరీత పరిణామాలేంటి? - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
ఆన్‌లైన్ ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గంటల తరబడి మొబైల్ ఫోన్లలో తలదూర్చి ఆటల్లో మునిగిపోతున్న పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. ఉచితంతో మొదలై.. ఆన్‌లైన్లో డబ్బులు చెల్లించి ఆడాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇదే అదనుగా భావించే సైబర్ మోసగాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డుల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఆటల యాప్స్ వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. ఇన్ యాప్ పర్చేజ్ నియమాలను కఠినతరం చేసింది. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.