AP Employees Strike: సమ్మెబాటలో ఉద్యోగ సంఘాలు.. వివాదం ఎందుకింత ముదిరింది? - p Government employees strike news
🎬 Watch Now: Feature Video
AP Employees Strike: రాష్ట్ర ప్రభుత్వఉద్యోగుల వేతన సవరణ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఎంతో ఇస్తున్నామంటున్న ప్రభుత్వం.. కడుపుమంట రగిలే ఉద్యమబాట అంటున్న ఉద్యోగ సంఘాల స్పందనతో... అది ఇంకాస్త రాజుకుంది. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఆందోళనల్ని పక్కదారి పట్టించేలా ప్రభుత్వ తీరు ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఇదే సమయంలో డిమాండ్ల సాధనపై వెనక్కి తగ్గేదే లేదంటూ... పీఆర్సీ సాధన సమితి ద్వారా ప్రభుత్వానికి సమ్మె నోటీసు పంపించారు ఉద్యోగులు. అసలు పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది? ఇకపై ఉద్యోగ సంఘాలు ఏం చేయనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.