ప్రతిధ్వని: ఐక్యరాజ్యసమితి.. సంస్కరణలు - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
విశ్వశాంతి, భద్రత, మానవహక్కుల పరిరక్షణ వంటి మహోన్నత లక్ష్యాలతో అవతరించిన ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతపై నేడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ... కీలక లక్ష్యాలను మాత్రం అందుకోలేకపోతోంది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో సమితి విఫలమైంది. పలు అంశాల్లో సమితి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీటో అధికారం దుర్వినియోగం అవుతున్న తీరుపై పై కూడా సభ్యదేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణయ ప్రక్రియలో 130 కోట్ల జనాభా గల భారత భాగస్వామ్యాన్ని ఎంతకాలం నిరాకరిస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూటిగా ప్రశ్నించారు. మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా సమితిలో సంస్కరణల అవసరాన్ని మనదేశం గొంతెత్తి చాటుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో రావలసిన సమగ్ర సంస్కరణలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.