Water Flow: త్రివేణి సంగమం వద్ద జల సవ్వడి
🎬 Watch Now: Feature Video
kaleshwaram triveni sangamam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ ఉట్టిపడుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో భారీ ప్రవాహం వస్తోంది. ఫలితంగా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కర ఘాట్ల పైనుంచి ఉభయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.540 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీకి 6,87,680 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. మొత్తం 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి 2,05,969 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.