Godavari Flood: జోరుగా వర్షాలు..ఉద్ధృతంగా గోదావరి - floods
🎬 Watch Now: Feature Video
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నదిలోకి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నదీ పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయ ఉద్ధృతికి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు.