అత్యద్భుతం యాదాద్రి పునర్నిర్మాణం - యాదాద్రి పునర్నిర్మాణ పనులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9423052-152-9423052-1604453507678.jpg)
అద్భుత కళాఖండాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా కనీవినీ ఎరుగని రీతిలో నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ వీడియోను వైటీడీఏ అధికారులు విడుదల చేశారు. సప్తరాజ గోపురాలు, అష్టభుజి మండప ప్రాకారాలు, పూర్తిగా కృష్ణ శిలతో ఆలయ పునర్నిర్మాణం, వివిధ నారసింహ రూపాలు, దేవతా విగ్రహాలు, పద్మాలు, యాలీ పిల్లర్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఆలయ అందాలు, అద్భుత కళాఖండాలను చూపించే దృశ్యమాలిక భక్తులకు కనువిందు చేస్తోంది.