ETV Bharat / state

చొక్కాపై ఆత్మహత్య కారకులు - ఆన్​లైన్ భూతానికి మరో వ్యక్తి బలి - MAN DIED DUE TO ONLINE BETTINGS

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌లో మరో ముగ్గురితో కలిసి సొమ్మ పెట్టిన కిశోర్‌కుమార్ - సొమ్ముని కట్టాలని కిశోర్‌ కుమార్‌పై ముగ్గురు ఒత్తిడి చేస్తున్నారన్న స్థానికులు

MAN SUICIDE DUE TO ONLINE BETTINGS
MAN SUICIDE DUE TO ONLINE BETTINGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 4:24 PM IST

A Man died Due to Online Betting Debts in Ananthapur District : బెట్టింగ్‌ యాప్‌లో పెట్టిన సొమ్ముని తననొక్కడినే కట్టమన్నారంటూ మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉరవకొండ పట్టణంలోని కుమ్మర వీధిలో నివాసం ఉంటున్న కిశోర్ కుమార్ (36) బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగంతో పాటు ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేవారు. అతనికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు సంతానం. భార్య వైఎస్సార్ జిల్లా చెన్నూరులో గ్రామ సచివాలయ మహిళ పోలీసుగా పని చేస్తున్నారు.

వారి ఒత్తిడి కారణంగా ఆత్మహత్య : కిశోర్ కుమార్ కొంత కాలంగా పట్టణానికి చెందిన మరో ముగ్గురితో కలిసి ఓ క్రికెట్ బెట్టింగ్ యాప్ లో సొమ్ము పెట్టాడు. అయితే ఇందులో దురదృష్టవశాత్తు కొంత మేర డబ్బును పొగొట్టుకున్నారు. తరువాత ఆ మొత్తాన్ని కట్టాలని మిగిలిన ముగ్గురు కొన్నాళ్ల నుంచి అతనిపై ఒత్తిడి చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కిశోర్ కుమార్ బెంగళూరు నుంచి ఉరవకొండకు వచ్చాడు.

విషయం తెలుసుకున్న మిగతా ముగ్గురు మరో ఇద్దరితో కలిసి శనివారం అతని ఇంటికి వెళ్లి సొమ్ము కట్టాలంటూ ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ జరుగుతున్న సమయంలోనే అతడు ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు హరి, కేదార్, సంజయ్ అని చొక్కాపై, మెడిసిన్ షీట్​పై రాశాడు. ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆన్​లైన్ బెట్టింగ్​లకు మరో వ్యక్తి బలి

రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ - ఆగమవుతున్న యువత - online betting games and apps

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.