TIRUMALA:ధ్వజరోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు - తిరుమల బ్రహ్మోత్సవాలు
🎬 Watch Now: Feature Video
అఖిలాండకోటి బ్రహ్మండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో.. వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంలో భాగంగా బంగారు తిరుచ్చిపై..శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రతాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అనంతరం శ్రీదేవి,భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య అర్చకులు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. ముక్కోటి దేవతలను, అష్టదిక్పాలకులను, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. రాత్రి 8 గంటలకు పెద్దశేషవహన సేవతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 9రోజుల పాటూ వివిధ వాహనాలపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.
Last Updated : Oct 7, 2021, 9:41 PM IST