సీలేరు జలపాతమా... భూతల స్వర్గమా..! - సీలేరు జలపాతం వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 4:44 AM IST

ప్రకృతి సోయగాలు, సెలయేర్ల పరవళ్లతో భూతల స్వర్గంలా కనువిందుచేస్తుంది విశాఖ జిల్లాలోని సీలేరు ప్రాంతం. కొండలపై నుంచి జాలువారుతున్న సెలయేర్లకు..రాళ్లు తాళం వేస్తుంటే... పక్షుల కిలకిలరావాలు ఇంపైన సంగీతాన్ని అందిస్తున్నాయి.కొండ అంచున్న తాకుతున్న మేఘాలు ఆంధ్రా కశ్మీరాన్ని తలిపిస్తున్నాయి. ఈ పర్యటక ప్రదేశాన్ని చూసేందుకు ఆంధ్ర, తెలంగాణలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వచ్చి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. కొండకోనలు పచ్చని చీర కట్టుకున్నాయా అనిపించే ప్రకృతి అందాన్ని చూసి మంత్రముగ్ధులౌతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు... సీలేరు, ఐస్​గెడ్డ, డొంకరాయి,పొల్లూరు జలపాతాల జాలువారే అందాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.