Pratidwani: ఆడవాళ్లకు రక్షణ ప్రశ్నార్థకమేనా..ఎందుకీ దుస్థితి ? - ఆడవాళ్లకు రక్షణ ప్రశ్నార్థకమేనా
🎬 Watch Now: Feature Video
ఒకటి వెంట మరొకటి. దారుణాలకు అడ్డే లేకుండాపోయింది. అబల ఆర్తనాదాలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. శాంతి భద్రతలు, మహిళల రక్షణ కోసం విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా..వరుస ఉదంతాలు వాస్తవం ఏమిటో కళ్లకు కడుతున్నాయి. ప్రాంతం, బాధితులు మారుతున్నారే కానీ... అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఒకవైపు ఉన్మాదుల దాడులు...మరోవైపు సామూహిక అత్యాచారాలు మహిళలను వణికిస్తున్నాయి. ఆడవాళ్లకు రక్షణ అన్నమాటే ప్రశ్నార్థకం అవుతోంది. అసలు ఎందుకీ దుస్థితి ? ఈ పరిస్థితి మారేది ఎప్పుడు ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.