ప్రతిధ్వని: వ్యవసాయ బిల్లులతో రైతులకు ప్రయోజనాలేంటి ? - నేటి ప్రతిధ్వని న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 21, 2020, 9:52 PM IST

వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన సమయంలో రాజ్యసభ రణరంగాన్ని తలపించింది. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని..లేదా సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటంతో మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ప్రభుత్వం నెగ్గించుకుంది. వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శాసనాలుగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కర్షక శ్రేయస్సే ఈ బిల్లుల ప్రధాన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన సంస్కరణలతో రైతులకు సాధికారత లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బిల్లులతో రైతులకు చేకూరే ప్రయోజనాలేమిటి? వీటివల్ల రైతులకు కలిగే ఉపయోగాలను చట్టసభల్లో ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా వివరించలేకపోయింది. గందరగోళ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు బిల్లులను నెగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.