ప్రతిధ్వని: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితేంటి ? - నేటి ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2021, 9:13 PM IST

దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం. తయారీ రంగంలో 45% ఉత్పత్తి అక్కడినుంచే. జీడీపీలో 30 శాతం వాటా...దేశ ఎగుమతుల్లో 40% వరకు భాగస్వామ్యం కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం మీద 4 కోట్ల వరకు ఉన్న ఎమ్మెస్​ఎమ్​ఈ యూనిట్లు..11కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా మరెంతో మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాంటి రంగం కొంతకాలంగా దిక్కుతోచని స్థితిలో పడి పోయింది. కొవిడ్‌కు ముందునుంచే సంక్షోభంలో చిక్కుకున్న ఎమ్మెస్​ఎమ్​ఈలను లాక్‌డౌన్లు చావుదెబ్బ తీశాయి. కాలు చేయి కూడదీసుకుని కోలుకుందామన్నా...బ్యాంకులు, పాలకుల నుంచి కావాల్సినంత సహకారం అందక వారి కష్టాలు తీరటం లేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్​ఎమ్​ఈల జీవన్మరణ పోరాటంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది .

For All Latest Updates

TAGGED:

prathidwani

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.